జె కొత్తూరు బలబద్రపురం బీటీ రోడ్డు శరవేగంగా సాగుతున్న పనులు

పనులు పరిశీలించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ
కాకినాడ జిల్లా జగ్గంపేట మార్చి 30: గత వైసీపీ ప్రభుత్వంలో చెరువులను తలపించిన రోడ్లకు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మోక్షం కలిగింది. ముఖ్యంగా జగ్గంపేట నియోజకవర్గం లో గ్రామీణ ప్రాంతాలకు వెళ్లి రోడ్లను తారు రోడ్లు గాను, సిమెంట్ రోడ్లు కోట్లాది రూపాయలతో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సారధ్యంలో పనులు సాగుతున్నాయి. ముఖ్యంగా రాజుపాలెం, రామవరం రోడ్డు, రాజపూడి, మన్యం వారి పాలెం రోడ్డు, జే కొత్తూరు, బలబద్రపురం రోడ్డు పనులు శరవేగంగా సాగుతున్న యి. ఆదివారం కొత్తూరు బలబద్రపురం రోడ్డు పనులను పరిశీలించి నాణ్యత ప్రమాణాలతో ఎక్కడ రాజీ లేకుండా రోడ్డు పనులు పూర్తి చేయాలని అధికారులు ఆదేశించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు, మారిశెట్టి భద్రం, పోతుల మోహనరావు, జీను మణిబాబు, చల్లా రామ్మూర్తి, పంచాయతీరాజ్ డిఇ ఉమ శంకర్, జె ఇ నారాయణమూర్తి, ఎంపీడీవో చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.


