బీబీ పేటలో ధాన్యం కొనుగోలు చేయాలని రైతుల ధర్నా…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; మే 10 (అఖండ భూమి న్యూస్) :
కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం తుజాల్ పూర్ గ్రామంలో రైతులు పండించిన పంటలను ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలిస్తే ఆరబెట్టిన ధాన్యాన్ని పూర్తిస్థాయిలో కొనుగోలు చేయకుండా తరుగు పేరుతో రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆగ్రహంతో ఉన్న రైతులు రోడ్డెక్కి ధర్నా నిర్వహించారు. ఆరబెట్టిన రైతుల ధాన్యాన్ని సకాలంలో కొడుకే కొనుగోలు కేంద్రాల వారు సేకరించకపోవడంతో వారిపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొనుగోలను రోజుల తరబడి నిర్లక్ష్యం చేయడంతో ఆగ్రహించిన రైతన్నలు ధర్నాలో వినూత్న స్థాయిలో నిరసన వ్యక్తం చేశారు. రైతుల ధాన్యాన్ని తరుగు పేరుతో రైస్ మిల్లర్లు చేయించడం లేదని సాకు చెప్పడంతో రైతన్నలు రెండు గంటల పాటు ధర్నా నిర్వహించారు. అనంతరం పోలీసులు జోక్యం చేసుకొని రైతులను సముదాయించడంతో కొనుగోలుపై భరోసా ఇవ్వడంతో రైతుల ధర్నాను విరమించారు. ఈ కార్యక్రమంలో రైతులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…



