కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు 

 

 

కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; మే 10 (అకాండ భూమి న్యూస్) :

కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలోని చుక్కాపూర్ శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం లో జరుగుచున్న వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా మూడవ రోజు శనివారం ఉదయం సేవా కాలం ప్రబోధ కి శాంతి పాఠం ద్వారా తోరణ పూజలు చచుస్థానార్చన, మూల మంత్ర హవనములు, నవ కలశ స్నపనం ఉత్సవమూర్తులకు పంచామృతాలు, పండ్లరసాలతో అభిషేక కార్యక్రమం నిర్వహించారు, పూర్ణాహుతి, తీర్థప్రసాద వితరణ మొదలగు కార్యక్రమంలు నిర్వహించినట్లు ఆలయ చైర్మన్ శనిగారం కమలాకర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమాలలో ఈవో శ్రీధర్ రావు, వేద పండితులు, అర్చకులు, డైరెక్టర్లు లక్ష్మీరాజం, ఆంజనేయులు, బాల్ రెడ్డి, జూనియర్ అసిస్టెంట్ సంతోష్ కుమార్, సిబ్బంది, వివిధ గ్రామాలలో నుండి వచ్చిన భక్తులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!