ఒకే దేశం ఒకే ఎన్నిక పై మేధావుల సమావేశం…
బిజెపి జిల్లా అధ్యక్షుడు నీలం చిన్న రాజులు..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; మే 27 (అఖండ భూమి న్యూస్);
ఒకే దేశం ఒకే ఎన్నిక అంశం పై కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పిజేఆర్ స్పూర్తి డిగ్రీ కళాశాలలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్న రాజులు అధ్యక్షతన మేధావులతో సమావేశం నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్న *ఒకే దేశం ఒకే ఎన్నిక పై మేధావుల అభిప్రాయాలను అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ విధంగా ఎన్నికలు జరిగితే ఆర్థికంగా, సామాజికంగా అన్ని రకాలుగా దేశానికి ఉపయోగపడుతుందని సభికులు తమ అభిప్రాయాలు చేప్పడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్లు, లాయర్లు, రిటైర్డు ఉద్యోగస్తులు, మీడియా, సోషల్ మీడియా వ్యక్తులు పాల్గొనడం జరిగింది.
ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన ఒకే దేశం ఒకే ఎన్నిక తెలంగాణ రాష్ట్ర ఇంచార్జీ అశ్వినీ పాండే మాట్లాడుతూ. ఒకే దేశం ఒకే ఎన్నిక పై కొన్ని పార్టీలు కావాలని దుష్ప్రచారం చేస్తున్నాయని, ఈ అంశంపై ప్రజల్లో విసృత చర్చ జరగాల్సిన అవసరం ఉందని, మాజీ రాష్ట్రపతి రాం నాథ్ కోవిధ్ ఆధ్వర్యంలో అన్ని వర్గాల మేధావులు, ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని పార్లమెంట్ లో ప్రవేశపెట్టడం జరిగిందని అన్నారు. అయినప్పటికీ ఈ అంశంపై ప్రజలకు పూర్తి స్థాయి అవగాహన కోసం గ్రామ గ్రామాన చర్చ పెట్టాల్సిన అవసరం ఉందని అన్నారు. దేశానికి ఉపయోగపడే ఎలాంటి మార్పులు అయినా చేయడానికి సిద్ధం అని అన్నారు. ప్రజలపై ఎన్నికల వ్యయ భారం పడకూడదు అని, ఎన్నికలు అభివృద్ధికి ఆటంకం కాకూడదు అని ఇలాంటి చట్టాలు రూపొందిస్తున్నట్టు వివరించారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో పలువురు మేధావులు పాల్గొన్నారు.