ప్రభుత్వ పాఠశాలల ప్రారంభానికి ముందే యూనిఫాంలు సిద్ధంగా ఉంచాలి..

 

ప్రభుత్వ పాఠశాలల ప్రారంభానికి ముందే యూనిఫాంలు సిద్ధంగా ఉంచాలి..

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; మే 27 (అఖండ భూమి న్యూస్)

పాఠశాలలో ప్రారంభానికి ముందే యూనిఫాం లు సిద్ధంగా ఉంచాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. మంగళవారం దోమకొండ మండల కేంద్రంలో నిర్వహిస్తున్న యూనిఫాం కుట్టు కేంద్రాన్నీ కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఈ విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే విద్యార్థులకు పంపిణీ చేసే యూనిఫాం లను సిద్ధం చేయాలని అన్నారు. జిల్లాలో 72,081 యూనిఫాం లకు గాను, 34428 మంది మగపిల్లలు, 37653 మంది ఆడపిల్లలకు యూనిఫాం పంపిణీ చేయవలసి ఉందని తెలిపారు. ఇప్పటి వరకు సిద్ధం చేసిన వివరాలు, విద్యార్థుల కొలతలు, కుట్టు విధానం, కటింగ్ విధానాన్ని కలెక్టర్ పరిశీలించారు.

జిల్లాలో 183 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను మహిళా సంఘాల ద్వారా ఏర్పాటు చేయడం జరిగిందని, ఇప్పటి వరకు 3.20 కోట్ల రూపాయలు బెనిఫిట్ పొందడం జరిగిందని తెలిపారు.

అనంతరం ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో నిర్మిస్తున్న ఇందిరమ్మ మోడల్ ఇంటి నిర్మాణాన్ని కలెక్టర్ పరిశీలించారు. నిర్మాణం.పనులు త్వరగా పూర్తి చేయాలని తెలిపారు.

ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలోని బోర్వెల్ రేచర్జీ స్ట్రక్చర్స్ ను కలెక్టర్ పరిశీలించారు.మండలంలో కేటాయించిన రేచర్జీ స్ట్రక్చర్స్ లను త్వరగా నిర్మించాలని, రైతులను ప్రోత్సహించాలని తెలిపారు.

అనంతరం ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ను కలెక్టర్ పరిశీలించారు. మహిళా సంఘాల సభ్యులు వ్యాపార రంగంలో రాణించి ఆర్థికంగా ఎదగాలని తెలిపారు.

ఈ కార్యక్రమాల్లో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సురేందర్, మండల ప్రత్యేక అధికారిణి, జిల్లా ఉద్యాన అధికారిణి జ్యోతి, డిపిఎం రమేష్,

తహసీల్దార్, ఎంపీడీఓ, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!