రైతుల చివరి గింజ వరకు వరి పంటను కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ…
కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; మే 27 (అఖండ భూమి న్యూస్)
చివరి గింజ వరకు వరి పంటను కొనుగోళ్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. మంగళవారం బీబీపేట్ మండలం లోని తుల్జాపూర్ గ్రామంలోని వారిందను కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించారు. వరి కోతలు పూర్తవడంతో కొనుగోళ్లు ఈ సారి 15 రోజులకు ముందుగానే పూర్తి అయ్యాయని కేంద్రం ఇంచార్జీ తెలిపారు. బీబీపేట్ మండలంలో ఏర్పాటుచేసిన కేంద్రాలలో యాడారం కొనుగోలు మరో వారం రోజులు తెరిచి ఉంటుందని, మిగతా కేంద్రాల్లో కొనుగోళ్లు పూర్తి అయ్యాయని తెలిపారు. రైతుల పండించిన చివరి గింజ వరకు కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు.
రైతులకు నాణ్యత గల విత్తనాలు, ఎరువులు అమ్మాలని కలెక్టర్ తెలిపారు. బీబీ పేట్ మండల కేంద్రంలోని లక్ష్మి నరసింహ ట్రేడ్స్ ఫెర్టిలిసర్స్, పెస్టిసైడ్స్, విత్తనాల దుకాణాన్ని కలెక్టర్ సందర్శించారు. ప్రభుత్వం అనుమతించిన విత్తనాలు, ఎరువులను మాత్రమే రైతులకు అమ్మాలని తెలిపారు. దుకాణంలో రికార్డులు, ఈ పాస్ మిషన్ లను కలెక్టర్ పరిశీలించారు.
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను త్వరగా నిర్మించుకోవాలని కలెక్టర్ తెలిపారు. బీబీపేట్ గ్రామంలోని దుబ్బల స్వరూప ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి ముగ్గు పోసి కొబ్బరికాయ కొట్టి, మంజూరు పత్రాన్ని కలెక్టర్ అందజేశారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయంలో నిర్మించిన మోడల్ ఇందిరమ్మ ఇంటిని కలెక్టర్ పరిశీలించారు. పనులు పూర్తిగా త్వరగా చేయాలని తెలిపారు.
రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని, ఆసుపత్రి పరిసరాలు శుభ్రంగా ఉంచాలని కలెక్టర్ మెడికల్ ఆఫీసర్ ను ఆదేశించారు. ఆసుపత్రిలోని సిబ్బంది హాజరు పట్టికను పరిశీలించారు. పలువురు సిబ్బంది హాజరుబ్రెజిస్టర్లో సంతకాలు చేయలేదని, విధుల్లో లేని వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సూపర్ వైజర్ అనధికార సెలవులో ఉండడం వలన అతనిని సస్పెండ్ చేయాలనీ జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి ఆదేశించారు. అదనపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి, ప్రోగ్రామ్ ఆఫీసర్స్ విధుల్లో లేరని వారికి నోటీస్ లు జారీచేయాలని తెలిపారు. అనంతరం ఆసుపత్రిలోని వాక్సిన్ రూమ్, ఐపి రూమ్, ఐపి వార్డ్ లను, ఆసుపత్రి వెనుక గల ఖాళీ స్థలాన్ని పరిశీలించారు. ఖాళీ స్థలంలోని చెత్తను తొలగించాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని మెడికల్ ఆఫీసర్ ను ఆదేశించారు.
ఈ కార్యక్రమాల్లో జిల్లా సహకార అధికారి రామ్ మోహన్, జిల్లా వ్యవసాయ అధికారి తిరుమల ప్రసాద్, గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ విజయపాల్ రెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి చంద్ర శేఖర్, మెడికల్ ఆఫీసర్ భాను ప్రియ, తహసీల్దార్ సత్యనారాయణ, ఎంపీడీఓ పూర్ణ చందర్, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.