వెన్నుపోటు సంస్కృతి వైసిపి పార్టీకే చెల్లుతుంది..

వెన్నుపోటు సంస్కృతి వైసిపి పార్టీకే చెల్లుతుంది..

ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడును విమర్శించే అర్హత వైసిపి పార్టీకి లేదు.

నీచమైన పాలన చేసింది వైసిపి శ్రేణులే..

అభివృద్ధి అంటే టిడిపి ప్రభుత్వంలోనే..

నాలుగో తారీఖున వెన్నుపోటు దినంగా ప్రకటించడం సిగ్గుచేటు అని విమర్శ..

గడిచిన సంవత్సర కాలంలోనే అభివృద్ధితో దూసుకుపోతున్న టిడిపి ప్రభుత్వం..

మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మకు అభివృద్ధిపై చర్చలకు సిద్ధమా అంటూ టిడిపి శ్రేణులు సవాల్ విసిరారు.

వెల్దుర్తి / కర్నూలు జూన్ 05 (అఖండ భూమి) : పత్తికొండ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే ఎక్కడ అభివృద్ధి చేసినట్లు చర్చలకు సిద్ధమ అని వెల్దుర్తి మండలం టిడిపి శ్రేణులు టిడిపి సీనియర్ నాయకులు బొమ్మిరెడ్డి పల్లె సుబ్బరాయుడు, సవాలు విసిరారు. గురువారం స్థానిక టిడిపి కార్యాలయం నందు పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టిడిపి శ్రేణులు మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి నిర్వహించిన వెన్నుపోటు కార్యక్రమాన్ని టిడిపి శ్రేణులు తిప్పికొట్టారు. గడిచిన ఐదు సంవత్సరాలలో మీ వైసిపి పార్టీ చేసిన అభివృద్ధి ఎక్కడెక్కడ జరిగిందో చర్చలకు సిద్ధమా అని ప్రశ్నించారు. నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం యావత్ ప్రపంచ దేశాలకు తెలుసన్నారు. జగన్ ప్రభుత్వంలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని విమర్శించారు. ఏమి ముఖం పెట్టుకొని ప్రజల దగ్గరకు వెళ్తున్నారు. మీకు ప్రతిపక్ష హోదా కూడా గత్యంతరం లేనప్పుడు ప్రజల ముందుకు వచ్చి మాట్లాడే హక్కు లేదని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడును, డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ ను, నారా లోకేష్ ను విమర్శించే అర్హత గాని అధికారం గాని వైసీపీ పార్టీకి ఎక్కడదని ఎద్దేమ చేశారు. మీకు ప్రజల ఇచ్చిన తీర్పు ఇక చాలదా.. మరోసారి చీ కొట్టించుకోవాలని అనుకుంటున్నారా అని ముక్తకంఠంతో ఖండించారు. స్థానిక సంస్థల ఎన్నికలలో టిడిపి ప్రభుత్వం కైవశం చేసి తీరుతుందని తెలిపారు. రానున్న నాలుగు సంవత్సరాల కాలంలో ముక్కున వేలు వేసుకొని టిడిపి చేస్తున్న అభివృద్ధిని చూస్తూ ఉండాలన్నారు. జూన్ 4న వెన్నుపోటు దినముగా ప్రకటించడం సిగ్గుచేటన్నారు. మీ బాబాయి గొడ్డలు పోటు వెన్నుపోటు కాదా, డాక్టర్ సుధాకర్ మరణం వెన్నుపోటు కాదా, కత్తి శీను డ్రామా ప్రజలను మోసగించడం కాదా అని విమర్శించారు. ప్రజలకు సేవ చేయకుండా నీచ సంస్కృతికి పాల్పడుతున్నది వైసిపి శ్రేణులని అన్నారు. పత్తికొండ నియోజకవర్గం సుఖశాంతులతో ప్రశాంతమైన వాతావరణంలో కేఈ శ్యాంబాబు నాయకత్వంలో ప్రజలు ఉన్నారన్నారు. కెఈ శ్యాం బాబు కళ్ళు తెరిచి రాజకీయం చేస్తే ఎవరు తట్టుకోలేరని అన్నారు. కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి కి వెన్నుపోటు పొడిచి మీరు ఎమ్మెల్యే స్థాయిని అందుకున్నారన్నారు. లేకుంటే మీకు ఆ అర్హత ఎక్కడిది అని సూటిగా ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకులు బొమ్మిరెడ్డి పల్లె సుబ్బరాయుడు, టిడిపి మండల కన్వీనర్ టి . బలరాం గౌడ్, టిడిపి యూత్ నాయకులు రమాకాంత రెడ్డి, టిడిపి తెలుగు యువత నాయకులు గుండ్రాతి సుధాకర్ గౌడ్, టిడిపి నాయకులు ఎర్రబజారు, రామళ్లకోట ఆచారి, పుల్లగుమ్మి వెంకటేశ్వర్ రెడ్డి, ఎల్ బండ మహిధర్ రెడ్డి, గూగుల్ అమర్నాథ్ గౌడ్, టిడిపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!