రోడ్డు విస్తరణకు అందరూ సహకరించాలి
కరాటే చీఫ్ ఇన్ స్ట్రక్టర్ ఎగ్జామినర్ “బాకురి పాండురాజు”
కొయ్యూరు అల్లూరి జిల్లా జూన్ 7(అఖండ భూమి)
గిరిజన ప్రాంతంలో చేపడుతున్న ఆర్ అండ్ బి రోడ్డు విస్తరణ పనులకు వర్తక సంఘాలు గిరిజన సంఘాలు ప్రజలందరూ సహకరించాలని కరాటే చీఫ్ ఇన్ స్ట్రక్టర్ ఎగ్జామినర్ బాకూరు పాండురాజు విజ్ఞప్తి చేశారు.శనివారం విలేకరులకు విడుదల చేసిన ప్రకటనలో పాండురాజు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ,ఆదేశాల మేరకు గిరిజన ప్రాంతంలో చేపడుతున్న ఆర్ అండ్ బి రోడ్డు విస్తరణ పనులకు ప్రతి ఒక్కరు ప్రభుత్వానికి అధికారులకు పూర్తిస్థాయిలో సహకరించాలన్నారు. అలాగే రోడ్డు విస్తరణలో షాపులు కోల్పోయిన షాపుల యజమానులందరికీ ప్రభుత్వము చొరవ తీసుకుని ఉపాధి కల్పించాలని, అలా జరిగితేనే వారికి న్యాయం జరుగుతుందని ఆయన ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరారు.



