రైతులకు సబ్సిడీపై వేరుశనగ విత్తనాలు పంపిణీ
తుగ్గలి జూన్ 7 అఖండ భూమి న్యూస్:-
మండల కేంద్రమైన తుగ్గలి లో శనివారము సబ్సిడీపై వేరుశనగ విత్తనాలను వ్యవసాయ అధికారి పవన్ కుమార్ ఆధ్వర్యంలో రైతులకు సర్పంచ్ రవి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహన రాష్ట్ర కార్యదర్శి తుగ్గలి నాగేంద్ర, టిడిపి మండల కన్వీనర్ తిరుపాల్ నాయుడు తదితరులు రైతులకు వేరుశనగ సబ్సిడీ విత్తనాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా టిడిపి నాయకులు తుగ్గలి నాగేంద్ర మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం కృషి చేస్తుందని తెలిపారు . త్వరలో రైతుల ఖాతాకు అన్నదాత సుఖీభవ కింద రూ 20వేల ఆర్థిక సాయం అందుతుందన్నారు. ఎమ్మెల్యే కెఈ శ్యాం కుమార్ కూడా రైతుల అభివృద్ధికి కృషి చేస్తున్నారన్నారు. రైతులందరికీ సమృద్ధిగా సబ్సిడీ విత్తనాలు అందించడం జరుగుతుందని ఎమ్మెల్యే కేఈ శ్యాం కుమార్ భరోసా ఇచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి పవన్ కుమార్ మాట్లాడుతూ కె 6 రకం విత్త నం1క్వింటాలు 9, 300 రూపాయలు. సబ్సిడీ 3, 720 రూపాయలు, రైతు చెల్లించాల్సిన నికర ధర 5, 580 రూపాయలు, సబ్సిడీ 40 శాతం అన్నారు. 0.5 ఎకరాల వరకు1 బస్తా, 0.51నుండి 1.00 ఎకరం వరకు 2 బస్తాలు 1.01 ఎకరాలపైగా 3 బస్తాలు విత్తనాల పంపిణీ చే స్తారని తెలిపారు. రైతులు తమ భూ పత్రాలు, ఆధార్ మరియు అవ సరమైన సమాచారంతో సహా సమీప రైతు సేవా కేంద్రాన్ని సం ప్రదించి నమోదు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సచివాలయ అగ్రికల్చర్ అసిస్టెంట్లు లోహిత్, సాయినాథ్ రెడ్డి, ఎంపీఈఓ స్రవంతి ,అన్ని గ్రామాల వ్యవసాయ శాఖ ఉద్యోగులు రైతులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.
You may also like
శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి నిఆహ్వానించిన ఆలయ ఈవో యం శ్రీనివాసరావు
శ్రీశైలం దేవస్థానంలో జరగబోయే దసరా మహోత్సవాలకుముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,లవారికి ఆహ్వానం
శ్రీశైలం మండలంసున్నిపెంట లో నిన్నఅనారోగ్యంతో మరణించిన చింత గుంట్ల రమేష్ ,వారి కుటుంబానికిఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆర్థిక సహాయం
తెలంగాణ మద్యం శ్రీశైలంలో పట్టివేత ఇద్దరు వ్యక్తులు అరెస్ట్
ఉచిత వైద్య శిబిరం విజయవంతం..