మానవ సేవయే మాధవ సేవ
మృతదేహన్ని కుటుంబ సభ్యులకు అప్పగించి
మానవత్వాన్ని చాటుకున్న స్ఫూర్తి సేవకులు
స్ఫూర్తి సేవా సమితి. డోన్/నంద్యాల జిల్లా
అఖండ భూమి వెబ్ న్యూస్ :-

నంద్యాల జిల్లా డోన్ ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో శ్రీశైలంకి చెందిన వెంకటేష్ నాయక్ అనే అభాగ్యుడు అనారోగ్యంతో చనిపోగా ఆర్టీసీ సిబ్బంది స్ఫూర్తి టీమ్ కి సమాచారం ఇవ్వగా స్ఫూర్తి టీమ్ సంఘటన జరిగిన స్థలానికి చేరుకొని, వివరాలు సేకరించగా అతడిది శ్రీశైలంకి చెందిన వెంకటేష్ నాయక్ గా గుర్తించి వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా వారు వచ్చిన తర్వాత డోన్ పట్టణ పోలీస్ వారికి సమాచారం అందించి మృత దేహాన్ని వారికి అప్పగించడం జరిగింది. అనంతరం మృతదేహన్ని సొంత ఊరికి అంబులెన్సులో తరలించారు. స్ఫూర్తి సేవలను పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో స్ఫూర్తి మధు, మోహన్ రెడ్డి, బొందిమడుగుల రాజు, అంబులెన్సు శేఖర్, వినయ్, ఆర్టీసీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
విద్యార్థులకు సైబర్ నేరాలపై బాల్య వివాహాలపై అవగాహన
లోకోస్ పై వీఓఏల శిక్షణ కార్యక్రమం
న్యాయవాద వృత్తిలో యువతకు భరోసా కల్పించండి: కలెక్టర్కు వినతిపత్రం అందజేసిన విశాఖపట్నం బార్ అసోసియేషన్.
రాష్ట్రంలో విద్య దోపిడి భయంకరంగా ఉన్నది,


