ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ

ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేసిన జిల్లా పరిషత్ మాజీ చైర్మన్, జిల్లా టిడిపి అధ్యక్షులు జ్యోతుల నవీన్

కాకినాడ జిల్లా జగ్గంపేట జూన్ 7 :జగ్గంపేటపట్టణంలోని

నియోజవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం జిల్లా పరిషత్ మాజీ చైర్మన్, కాకినాడ జిల్లా టిడిపి అధ్యక్షులు జ్యోతుల నవీన్ చేతుల మీదుగా పలువురికి ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందజేశారు. అనారోగ్యంతో బాధపడుతూ, వైద్యానికి ఆర్థికస్తోమత లేని బాధితులు సాయం కోసం అర్థించగా, స్థానిక ఎమ్మెల్యే, టిటిడి బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ సిఫార్సుతో వీరందరికీ ముఖ్యమంత్రి సహాయనిధి సాయం మంజూరైంది. నవీన్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం సంవత్సర కాలంలోనే నియోజకవర్గం అనేకమందికి ముఖ్యమంత్రి సహాయనిది చెక్కులు మంజూరు అయ్యాయని అన్నారు. ఆరోగ్యం దేశాభివృద్ధికి మూలమని, ఆపదలో ఉన్న పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి సాయం ఆశాజ్యోతి కావాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరికీ ఆరోగ్య సేవలు అందుబాటులో ఉండేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు, కుంచే రాజా, పైడిపాల సూరిబాబు, రేఖ బుల్లి రాజు, రాజపూడిసర్పంచ్ బుసాలవిష్ణు,సర్వసిద్ధి లక్ష్మణరావు, ఎస్ బాబు, బోండా శ్రీనుబాబు, గల్లా రాము, ఉప్పలపాటి బుల్లి అబ్బులు, సాంబత్తుల చంద్రశేఖర్, గనిశెట్టి సన్యాసిరావు తదితరులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!