ప్రజల సమస్యలు పరిష్కారానికి ప్రజా దర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ

ప్రజల సమస్యలు పరిష్కారానికి ప్రజా దర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ

కాకినాడ జిల్లా జగ్గంపేట జూన్ 7: స్థానిక రావులమ్మ నగర్ లో టిడిపి కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజా దర్బార్ నిర్వహించిన జగ్గంపేటఎమ్మెల్యే, టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ తన క్యాంపు కార్యాలయంలో శనివారం ప్రజాదర్బార్‌ నిర్వహించారు.మల్లిసాల గ్రామంలో లో వోల్టేజీ సమస్య పై అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని కోరారు. ఎస్ తిమ్మాపురం శివాలయం చేప చెరువు వివాదాన్ని పరిష్కరించాలని వినతిపత్రం అందజేసిన గ్రామ ప్రజలు. వీటితోపాటు తాగునీరు, రోడ్లు, తదితర సమస్యలపై ప్రజలు వినతులు ఇచ్చారు. సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేలా కృషి చేస్తానని అన్నారు. ఏమైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు, కుంచే రాజా, కొత్త కొండబాబు, అడబాల భాస్కర రావు, అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!