జగ్గంపేటలో ఘనంగా లయన్స్ క్లబ్ 108వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు
 
ముఖ్యఅతిథిగా లయన్ డిస్టిక్ చైర్మన్ కొత్త వెంకటేశ్వరరావు హాజరై మెల్విన్ జోన్స్ విగ్రహానికి పూలమాలు వేసి నివాళులు అర్పించారు.
కాకినాడ జిల్లా జగ్గంపేట జూన్ 7: స్థానిక గోకవరం రోడ్డులో గల కోడూరి రంగారావు లైన్స్ కంటి జిల్లా హాస్పటల్ నందు ఘనంగా లైన్స్ క్లబ్ 108వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్, లైన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ చైర్మన్ లయన్ కొత్త వెంకటేశ్వరరావు(కొండబాబు) ముఖ్యఅతిథిగా హాజరై లైన్స్ క్లబ్ వ్యవస్థాపకులు మేల్విన్ జోన్స్ విగ్రహానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కొత్త కొండబాబు మాట్లాడుతూ లయన్స్ ఇంటర్నేషనల్, కులమతాలకు అతీతంగా లైన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ సేవాసంస్థ జూన్ 7వ తేదీ1917లో స్థాపించబడిందని ఈ సంస్థని మే ల్విన్ జోన్స్ స్థాపించారని 206 దేశాలలోని, 44,500 లయన్సు క్లబ్బుల ద్వారా, 13 లక్షల మంది సభ్యులు సేవలు చేస్తున్నారు. అని కొండబాబు అన్నారు. ఈ సంస్థ, స్థానిక ప్రజల అవసరాలను గమనించి, వీలైతే స్థానికంగా, లేదంటే, అంతర్జాతీయంగా, లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్, సహాయంతో, ఆ అవసరాలను తీర్చుతుంది. విశాఖపట్నంలోని కేన్సర్ ఆసుపత్రిని, జగ్గంపేటలోని కంటి ఆసుపత్రిని లయన్స్ క్లబ్ ఈ విధంగానే నెలకొల్పి, ప్రజలకు అంధుబాటులోకి తెచ్చింది. అని కొత్త కొండబాబు అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వి డయానా, హాస్పిటల్ ఇన్చార్జ్ గంగరాజు, జగ్గంపేట నియోజకవర్గం తెలుగు యువత ఉపాధ్యక్షులు బద్ది సురేష్, ఆసుపత్రి సిబ్బంది, లైన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.


