వందల కొద్ది భారీ వాహనాలతో- గ్రామీణ రోడ్లు చిత్తు..
తరచూ స్తంభిస్తున్న ట్రాఫిక్.. భయాందోళనలో ప్రజలు.. పట్టించుకోని రవాణా శాఖ అధికారులు..
శంఖవరం, జూన్ 7 (అఖండభూమిన్యూస్): ప్రకృతి రమణీయతకు
మారుపేరుగా నిలిచేవి గ్రామాలు. అటువంటి గ్రామాల్లో ప్రశాంత
వాతావరణాన్ని కాలుష్య రక్కసి నాశనం చేస్తూ వందల కొద్దీ
లారీలతో రాత్రి పగలు రవాణా అడ్డూ అదుపు లేకుండా
జరుగుతుంటే రహదారులన్నీ చిత్తవుతున్నాయి. రౌతులపూడి,
శంఖవరం మండలాల్లో నిత్యం ఈ రోడ్లపై వందలాది లారీలతో
నల్లరాయి, లేటరైట్, గ్రావెల్, మట్టిని ప్రభుత్వం ఏదైనా
అధికారాన్ని అడ్డుపెట్టుకొని అక్రమ దందా సాగించడం పరిపాటిగా
మారింది. ఈ రోడ్డుపై పరిమితికి మించిన భారీ వాహనాలు
సుమారు 50 నుండి 60 టన్నుల పైబడి లోడుతో నడపడం
పరిపాటిగా మారింది. భారీ వాహనాలు అనుకుంటే వాటిపై
అంతకుమించిన భారీ నల్లరాయి, లేటరైట్, ఇసుక లోడు
వేసుకుని లారీ నుండి జారిపడే విధంగా రవాణా చేస్తున్నారు.
దీనితో పలు గ్రామాల ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. భారీ
వాహనాలతో రోడ్లు పాడై, దుమ్ము, ధూళితో మా ఆరోగ్యాలు
దెబ్బతింటున్నాయని, దయచేసి పర్యావరణాన్ని కలుషితం
చేయవద్దని ప్రజలు వేడుకుంటున్నారు. ఈ రోడ్లపై తరచూ
స్తంభిస్తున్న ట్రాఫిక్ తో బస్సులో ప్రయాణించే ప్రయాణికులు,
విద్యార్థులు, వాహనదారులు నరకం చూస్తున్నారు. పైడిపాల క్వారీ
నుంచి నల్ల రాయి, అనకాపల్లి జిల్లా సరుకుడు పంచాయితీ పరిధి
నుంచి లేటరైట్ తో భారీ టిప్పర్లు తో రవాణా సాగిస్తున్నారు. భారీ
వాహనాలను రవాణా చేసేందుకు చూపిన శ్రద్ధ, ప్రజల భద్రత,
రోడ్డు భద్రత వంటి అంశాలపై ఎటువంటి చర్యలు అధికారులు
గానీ, ప్రజా ప్రతినిధులు గాని పట్టించుకోకపోవడం పలు
విమర్శలకు దారితీస్తుంది. ఇంతటి భారీ వాహనాలు అధిక
లోడుతో రవాణా శాఖ అధికారి కార్యాలయం ఎదురుగా
వెలుచున్న రాకపోకలను నిలుపుదల చేయడంలో ఎందుకు
తాత్సారం చేస్తున్నారో వారికే తెలియాలి. మరో పది రోజుల్లో
పాఠశాలలకు వేసవి సెలవులు ముగుస్తాయి. భారీ వాహనాలు ఈ
రోడ్లపై ప్రమాదకరంగా దూసుకొస్తుండటంతో తల్లిదండ్రులు తమ
పిల్లలను బడికి పంపడానికి భయపడుతున్నారు. ఇప్పటికైనా
సంబంధిత అధికారులు తూతూ మంత్రంగా భారీ వాహనాలపై
కేసులు నమోదు చేయకుండా ప్రజలు భయాందోళన నుంచి
బయటకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని యువకులు
కోరుచున్నారు.
You may also like
శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి నిఆహ్వానించిన ఆలయ ఈవో యం శ్రీనివాసరావు
శ్రీశైలం దేవస్థానంలో జరగబోయే దసరా మహోత్సవాలకుముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,లవారికి ఆహ్వానం
శ్రీశైలం మండలంసున్నిపెంట లో నిన్నఅనారోగ్యంతో మరణించిన చింత గుంట్ల రమేష్ ,వారి కుటుంబానికిఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆర్థిక సహాయం
తెలంగాణ మద్యం శ్రీశైలంలో పట్టివేత ఇద్దరు వ్యక్తులు అరెస్ట్
ఉచిత వైద్య శిబిరం విజయవంతం..