రైతులకు ఖరీఫ్ పంట విత్తనాల విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదు.

నకిలీ విత్తనాలు మార్కెట్ లోకి రాకుండా చర్యలు చేపట్టాలి.
అధికారులు రైతులకు అందుబాటులో ఉండాలి.
యూరియా, డాప్ వంటి ఎరువుల కొరత రాకుండా చూడాలి.
కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి.
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 9 (అఖండ భూమి న్యూస్)
ఖరీఫ్ పంటల సీజన్ ప్రారంభం అయిన సందర్భంగా కామారెడ్డి నియోజకవర్గ పరిధిలోని వ్యవసాయ అధికారులతో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి సమీక్షా సమావేశం ఏర్పాటు సోమవారం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. ఈ రైతులకు ఖరీఫ్ పంటకి విత్తనాల విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదనీ, విత్తనాల కొరత ఏర్పడకూడదు అని నకిలీ విత్తనాలు మార్కెట్ లోకి రాకుండా చర్యలు చేపట్టాలనీ అన్నారు. వ్యవసాయ అధికారులు రైతులకు అందుబాటులో ఉండాలనీ రైతులకు ఏమైనా అపోహలు ఉంటే తొలగించాలని అన్నారు. యూరియా, డాప్ వంటి ఎరువుల కొరత రాకుండా చూడాలనీ అన్నారు. రైతులకు నకిలీ విత్తనాలు, ఎరువుల కొరత , విత్తనాల కొరత వంటి ఏ సమస్య రావొద్దని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
విద్యార్థులకు సైబర్ నేరాలపై బాల్య వివాహాలపై అవగాహన
లోకోస్ పై వీఓఏల శిక్షణ కార్యక్రమం
న్యాయవాద వృత్తిలో యువతకు భరోసా కల్పించండి: కలెక్టర్కు వినతిపత్రం అందజేసిన విశాఖపట్నం బార్ అసోసియేషన్.
రాష్ట్రంలో విద్య దోపిడి భయంకరంగా ఉన్నది,


