ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలు అందజేస్తాం…

పాఠశాల ఆవరణలో మౌలిక సదుపాయాల కల్పనకి కృషి చేస్తా..
ప్రభుత్వ పాఠశాలలో అక్షర అభ్యాసం కార్యక్రమం పెట్టడం సంతోషం..
తల్లిదండ్రులు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చడానికి ముందుకు రావాలి..
కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 13 (అఖండ భూమి న్యూస్)
కామారెడ్డి మండలం ఉగ్రవాయి గ్రామ ప్రాథమికోన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన *సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం సందర్భంగా ముఖ్య అతిథిగా కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి హాజరైనారు.
ఈ సందర్భంగా శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలు అందజేస్తామని ఇందుకు ప్రభుత్వ ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు, అధికారులు అందరూ కలిసి విద్యార్థులకు సమస్యలు రాకుండా చూస్తామని అన్నారు. పాఠశాల ఆవరణలో మౌలిక సదుపాయాలు అయిన త్రాగునీరు, మూత్రశాలలు, మరుగుదొడ్ల విషయంలో సౌకర్యాల కల్పనకి కృషి చేస్తానని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో అక్షర అభ్యాసం కార్యక్రమం పెట్టడం సంతోషం అని అన్నారు. తల్లిదండ్రులు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చడానికి ముందుకు రావాలి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…


